పంజాబ్‌లో వరద సహాయక చర్యల కోసం మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ ( Harbhajan Singh ) బోట్లు, అంబులెన్స్‌లను అందించారు. ఎంపీ నిధుల నుంచి 8 స్టీమర్ బోట్లను, తన సొంత నిధుల నుంచి 3 బోట్లను ఆయన మంజూరు చేశారు. అలాగే, వరద బాధితులకు సాయం చేసేందుకు మూడు అంబులెన్స్‌లను కూడా సమకూర్చారు. భారీ వర్షాలు, నదీ తీరాల ఉప్పొంగడం వల్ల పంజాబ్‌లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో, హర్భజన్ సింగ్ తన వంతుగా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వరద సహాయక చర్యలకు అవసరమైన నిధులను కూడా ఆయన సమీకరిస్తున్నారు. ఈ కష్టకాలంలో పంజాబ్ ప్రజలకు మరింత సహాయం అందిస్తానని హర్భజన్ సింగ్ హామీ ఇచ్చారు.