India High Alert : దేశవ్యాప్తంగా హై అలర్ట్

Update: 2025-05-07 11:30 GMT

ఆపరేషన్ సిందూర్ అనంతరం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. పంజాబ్, పాక్ సరిహద్దు జిల్లాల్లోని స్కూళ్లకు మూడు రోజుల పాటు సెలవులు ఇచ్చారు. హర్యానా, పంజాబ్ లోని అన్ని ఎయిర్వేస్ వద్ద భద్రతా కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడుల తర్వాత చండీగఢ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద హై అలర్ట్ జారీ చేసిన యంత్రాంగం మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. అట్టారీ సరిహద్దులో సాధారణ పరిస్థితులే ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ లోని ప్రతి కదలికను బీఎస్ ఎఫ్, వైమానిక దళం, సైన్యం నిశితంగా గమనిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలతో ఉత్తరప్రదేశ్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ లో వెల్లడించిన యూపీ డీజీపీ ప్రశాంత్కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు కార్యకలాపాలు డిఫెన్స్ యూనిట్లతో సమన్వ యం చేయడంతో పాటు కీలక ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసినట్లు తెలిపారు.

Tags:    

Similar News