Supreme Court : రెండేండ్లు బయట చదివితే లోకల్ కాదంటే ఎలా?

Update: 2025-08-06 13:00 GMT

తెలంగాణలో పుట్టిన విద్యార్థి ఇక్కడే చదివి.. ఆ తర్వాత 2 సంవత్స రాలు బయట చదివినంత మాత్రాన తెలంగాణ కోటా వర్తించదంటే ఎలా అని సీజేఐ గవాయ్ ప్రశ్నించారు. తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. స్థానికులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదవకపోయిన స్థానిక కోటా వర్తిస్తుందన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పదో తరగతి తర్వాత రెండేళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు సీజేఐ బీఆర్ వాయ్ మాట్లా డుతూ టెన్త్, 11వ తరగతుల కోసం బయటకు వెళ్లిన విద్యార్థులకు అన్యాయం చేయరాదన్నా రు. దుబాయ్ లాంటి ప్రాంతాలకు ఇంటర్ చదువుకోడానికి వెళ్లిన విద్యార్థులకు స్థానిక కోటా వర్తించదంటే ఎలా అని సీజేఐ ప్రశ్నిం చారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఎటూ స్థానిక కోటా కిందకు రారని సీజేఐ స్పష్టం చేశారు. నాలుగు సంవత్సరాల చదువు లేదా నివాసం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానికత ఖరారు చేసిందని ప్రభుత్వం తరఫున న్యాయవాది సింఘ్వీ న్యాయస్థానానికి వివరించా రు. దీనిపై స్పందించిన సీజేఐ 2024లో తీసుకువచ్చిన నిబం ధనను 2028కి వర్తింపజేస్తే సరిపోతుందని పేర్కొన్నారు ప్రతి విద్యార్థి 371డీ అధికరణం గురించి తెలుసుకోవాలన్నట్టుగా మీ వాదనలు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పలు రాష్ట్రాల్లో స్థానికత వ్యవహారం వేర్వేరు గా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీవివరించారు.... అస్సాంలో 7 సంవత్సరాల నిబంధన ఉందని అభిషేక్ సింఘ్వీ గుర్తు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో పేద, మధ్యతరగతి వాళ్లకు జరు గుతున్న ఉపయోగాన్ని విస్తృత కోణం నుంచి చూడాలని, అందుకు తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. వాదనల అనంతరం తీర్పు రిజర్వు చేస్తున్నట్టు సీజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags:    

Similar News