Covid New Variant: మరో 6 నెలల్లో.. కొత్త వేరియంట్.. కొత్త వేవ్..!

Covid New Variant: ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌తో పోలిస్తే థర్డ్ వేవ్‌లో కరోనా ప్రభావం చాలావరకు తగ్గింది.

Update: 2022-02-22 12:08 GMT

Covid New Variant: ఒక్కసారిగా ప్రపంచాన్నంతా కుదిపేసిన మహమ్మారి నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. రెండేళ్ల క్రితం ప్రపంచంలోకి ఓ చిన్న సమస్యగా వచ్చిన కరోనా.. ఎంతోమంది ప్రాణాలను తీసింది. కొన్నాళ్లకు అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో మరోసారి సెకండ్ వేవ్ రూపంలో వచ్చింది. ఇక దాని నుండి మనకు ఏమీ ముప్పు ఉండదని ప్రస్తుతం ప్రజలంతా మామూలు పరిస్థితుల్లో జీవించడం మొదలుపెట్టారు. కానీ నిపుణులు మాత్రం మరో వేవ్ తప్పదని అంటున్నారు.

ఇప్పుడిప్పుడే కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌తో పోలిస్తే థర్డ్ వేవ్‌లో కరోనా ప్రభావం చాలావరకు తగ్గింది. అయితే ఇంకా కరోనా నుండి కూడా ప్రపంచం ఫ్రీ అయిపోయినట్టే అని ఇప్పుడిప్పుడే అందరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. పలు ఫారిన్ దేశాలు కోవిడ్ నిబంధనలను రద్దు చేసే ఆలోచనలో కూడా ఉన్నాయి. అయితే మరికొన్ని నెలల్లో మరో వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్యులు.

అయితే ఇప్పటికే కరోనా ఎన్నో వేరియంట్ల రూపంలో ప్రజలను బలిదీసుకుంది. మరో రూపంలో కరోనా వస్తే.. రానున్న 6 నుండి 8 నెలల్లో మరో వేవ్ వచ్చే అవకాశం ఉందని ప్రముఖ వైద్య నిపుణులు అంచనా వేస్తు్న్నారు. ఒమిక్రాన్ నుండి వస్తున్న సబ్ వేరియంట్లు మాత్రం మరో వేవ్‌కు దారితీసే అవకాశం లేదని అంటున్నారు. కానీ మరో కొత్త వేరియంట్ వచ్చినప్పుడు మరో వేవ్ ఉంటుందని, అది ఎప్పుడో చెప్పలేమని వారు చెప్తున్నారు.

Tags:    

Similar News