Jaipur: ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఏడుగురు రోగులు మృతి

జైపూర్‌లోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సవాయి మాన్ సింగ్ ఆసుపత్రి రెండవ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగిన వెంటనే సిబ్బంది పారిపోయారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Update: 2025-10-06 06:59 GMT

జైపూర్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సవాయి మాన్ సింగ్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు రోగులు మరణించారు. భవనంలోని రెండవ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగిన వెంటనే సిబ్బంది పారిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆదివారం రాత్రి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో రోగులు, వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురయ్యారు. ఈ మంటల ధాటికి ఆసుపత్రికి సంబంధించిన పరికరాలన్నీ ధ్వంసం అయ్యాయి.  

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోమవారం, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఈ సంఘటనపై వైద్య విద్య శాఖ కమిషనర్ ఇక్బాల్ ఖాన్ అధ్యక్షతన ఒక కమిటీ దర్యాప్తునకు ఆదేశించారు.

ఈ సంఘటన దృష్ట్యా, ముఖ్యమంత్రి ఈరోజు ఢిల్లీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో, 210 మంది రోగులు ఉన్నారు. నాలుగు ఐసియులలో ఒక్కొక్కదానిలో 40 మంది రోగులు ఉన్నారు. రాత్రి సమయంలో, ప్రతి ఐసియులో ఒక సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఆసుపత్రి సిబ్బంది మరియు రోగి సహాయకులు రోగులను తరలించారు. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చారు.

"ఆరుగురు రోగులు చాలా విషమంగా ఉన్నారు. మేము ఎంత ప్రయత్నించినా, ఎక్కువసేపు CPR ఇచ్చినా, వారిని కాపాడలేకపోయాము. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు. మరో ఐదుగురు రోగుల పరిస్థితి విషమంగా ఉంది" అని డాక్టర్ తెలిపారు.

బాధితుడి బంధువు ఒకరు వార్తా సంస్థతో మాట్లాడుతూ, "ICUలో మంటలు చెలరేగాయి, కానీ దానిని ఆర్పడానికి పరికరాలు లేవు, అగ్నిమాపక యంత్రాలు లేవు, సిలిండర్లు లేవు, మంటలను ఆర్పడానికి నీరు కూడా లేదు. అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. నా తల్లి బ్రతకలేదు" అని అన్నారు.

సోమవారం ఉదయం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, రోగుల భద్రత, చికిత్స మరియు బాధిత వారికి సంరక్షణ అందించడానికి స్థానిక పరిపాలన అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు.

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, "భవిష్యత్తులో ఎక్కడా ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసుకోవడానికి ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు నిర్వహించాలని" రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    

Similar News