లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ( Arvind Kejriwal ) దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కేజ్రివాల్ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు ఇచ్చింది.
కోర్టు, తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ను జూన్ 26న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
మరోవైపు.. సోమవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు బీఆర్ఎస్ నేతలు. కేటీఆర్, హరీష్ దీని విషయంలో ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.