MAHARASTRA: అందరి మధ్య మంత్రిపై పసుపు చల్లిన వ్యక్తి

రాధాకృష్ణ విఖే పాటిల్‌కు చేదు అనుభవం.... పసుపు చల్లిన వ్యక్తి అరెస్ట్‌...;

Update: 2023-09-09 02:30 GMT

మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ను కలిసేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఉన్నట్టుండి ఆయన తలపై పసుపు చల్లాడు. ఆ చర్యతో మంత్రి అవాక్కయ్యారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పసుపు చల్లిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. రిజర్వేషన్‌లను డిమాండ్ చేస్తున్న ఓ వర్గానికి చెందిన ప్రజలను ఇవాళ విఖే పాటిల్ కలుసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు మంత్రికి ఒక లేఖను ఇవ్వగా ఆయన దానిని చదువుతున్నారు. అంతలోనే వారిలో ఒకరు తన జేబులో నుంచి పసుపు తీసి పాటిల్ తలపై చల్లాడు. దాంతో అవాక్కైన మంత్రి అతడికి దూరం జరిగారు. ఈ చర్యతో ఆగ్రహానికి గురైన మంత్రి అనుచరులు అతడిని నేలమీదకు ఈడ్చి, దాడి చేశారు. మరోపక్క తన్నులు తింటూ కూడా ఆ వ్యక్తి రిజర్వేషన్ల గురించి తన డిమాండ్ వినిపించాడు.

Tags:    

Similar News