బస్తర్‌లోని అబూజ్‌మఢ్ అడవుల్లో అన్నల ఆధిపత్యానికి గండిపడింది. ‘కగార్’ పేరుతో కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌కు మావోయిస్టుల కంచుకోట కకావికలం అయింది. లొంగిపోయిన మావోయిస్టులను రిక్రూట్ చేసుకొని నక్సల్స్‌పైకి పంపారు. వీరికి తోడు CRPF, కోబ్రా బలగాలతో డ్రోన్లను ఉపయోగించి నక్సల్స్ జాడ పసిగట్టి చుట్టుముట్టి దాడి చేస్తున్నారు. దీంతో ఏడాదిలో 42 ఎన్‌కౌంటర్లు జరగగా అగ్రనేతలు సహా 300 మంది నక్సల్స్ హతమయ్యారు.
ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27మంది మావోయిస్టులు చనిపోగా, వారిలో ఆ పార్టీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చలపతి(60) ఉన్నారు. ఇతను ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. ఈయనది చిత్తూరు జిల్లా మాటెంపల్లి కాగా, రూ.కోటి రివార్డ్ ఉంది. చలపతి వద్ద ఎప్పుడూ ఏకే 47, ఎస్ఎల్ఆర్ వెపన్స్ ఉంటాయని, చుట్టూ 8- 10 మంది మావోలు సెక్యూరిటీ ఉంటారని సమాచారం.