Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. ఆ పేరే ఎందుకు ?
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటున్న భారత్..;
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారతదేశం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్‌పై ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడింది. 9 ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా చేపట్టినట్లు ఇండియన్ సైన్యం ప్రకటించింది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. ఈ ఆపరేషన్‌కు పెట్టిన పేరుతోనే పాక్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందంటున్నారు. ఈ ఆపరేషన్‌ను త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో చేశాయి. కాశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థల కీలకమైన క్యాంప్‌లను ఇప్పటికే నేలమట్టం చేసేశాయి.
అయితే, ఈ ఆపరేషన్ కు సింధూర్ అనే పేరెందుకు పెట్టారనే విషయంపై ఒక థియరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పహల్గామ్ లో భార్యల కళ్ల ముందే భర్తలను చంపి ఉగ్రవాదులు మన ఆడబిడ్డల నుదటిన సింధూరాన్నితుడిచి వేశారు. దానికి ప్రతికారమే ఈ దాడి అన్న అర్థంలో సింధూర్ అని త్రివిధ దళాలు పేరు పెట్టాయని ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని ఓ మాజీ సైనికాధికారి కూడా పేర్కొన్నారు. కాబట్టి ఆర్మీ వాళ్లు చాలా చాలా ఆలోచించి ఆ ఆపరేషన్‌కు ఆపరేషన్ సిందూర్ అని నామకరణం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భారత సైన్యంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
కశ్మీర్ యాత్ర అంటేనే.. ప్రకృతి అందాలతో కనుల విందు చేసే ఆకర్షణీయమైన పచ్చిక బయళ్లు, మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు, చుట్టూ ఎత్తైన కొండలు.. ఆ కొండల మధ్య నదులు, సరస్సులు ఆకట్టుకుంటాయి. భారీ ఫైన్ వృక్షాల మధ్య మూడు వేల మీటర్ల ఎత్తులో ఉన్న బైసరన్‌లో సూర్యోదయం, సూర్యాస్తామయం చూడడానికి రెండు కళ్లు చాలవు అన్నట్టుగా ఆ ప్రకృతి రమణీయత ఎంతో కట్టిపడేస్తుంది. ఎంతో సుందరమైన ఈ ప్రదేశానికి లక్షలాది మంది పర్యాటకులు తరలివస్తుంటారు. కొత్తగా పెళ్లైన జంటలకు మినీ స్విట్జర్లాండ్‌గా ప్రసిద్ధి గాంచిన బైసరాన్ హనీమూన్‌కు హాట్‌స్పాట్. కానీ ఆ హనీమూన్ స్పాట్.. తుపాకుల తూటాలతో దద్దరిల్లి.. బ్లడ్ మూన్‌గా మారిన సంగతి తెలిసిందే. భూతల స్వర్గం కశ్మీర్ యాత్ర.. జీవితాంతం ఒక మధురానుభూతిగా మిగలాలని కోరుకుంటారు.. కానీ ఈ మూడు జంటలకు జీవితాంతం శాపని తీరంగా మారింది.