Mining : మైనింగ్ రంగంలో సానుకూల ప్రగతి : కేంద్రం

Update: 2025-09-30 09:00 GMT

మైనింగ్ రంగంలో సానుకూల ప్రగతితో ఆగస్టు నెలలో దేశ పారిశ్రామిక రంగం 4 శాతం వృద్ధి చెందినట్టు కేంద్రం తెలిపింది. జులైలో ముందు అంచనావేసినట్టు పారిశ్రామిక ప్రగతి 3.5 నుంచి 4.3శాతానికి సవరించినట్టు వెల్లడించింది. ఆగస్టులో.. మైనింగ్ రంగం 6 శాతం వృద్దిచెందినట్టు జాతీయ గణాంక విభాగం తెలిపింది. గత ఏడాది ఆగస్టులో మైనింగ్ రంగం 4.3శాతం క్షీణత నమోదుచేసినట్టు గుర్తుచేసింది. దేశ పారిశ్రామిక ప్రగతిలో నాలుగింట మూడొంతులు ఉండే తయారీ రంగం ఆగస్టులో 3.8శాతం వృద్ధి నమోదు చేసినట్టు గణాంక విభాగం తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో తయారీ రంగం 1.2శాతమే వృద్ధి నమోదుచేసినట్టు గుర్తుచేసింది. ఆగస్టులో విద్యుత్ రంగం 4.1శాతం వృద్ధిచెందినట్టు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య పారిశ్రామిక ప్రగతి 2.8శాతానికే పరిమితమైనట్టు వెల్లడించిన గణాంక విభాగం... గత ఏడాది ఇదే కాలంలో 4.3శాతం వృద్ధి చెందింది.  

Tags:    

Similar News