West Bengal Train Accident : బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాన మంత్రి కార్యాలయం

Update: 2024-06-17 09:12 GMT

పశ్చిమ బెంగాల్‌‌లో రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితులకు ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వనున్నారు. ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఈ ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోగా 60మంది గాయపడ్డారు. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

పశ్చిమ బెంగాల్ న్యూజల్పాయిగుడిలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. తొలుత ఐదుగురు చనిపోగా, ఇప్పుడు మృతుల సంఖ్య 15కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 60 మందికిపైగా ప్రయాణికులకు గాయాలైనట్లు తెలిపారు. అటు మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. గూడ్స్ రైలు వెనుకనుంచి ఢీకొట్టడంతో కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్ చివరి 2 బోగీలు దెబ్బతిన్నాయి. అయితే వాటిలో ప్రయాణికులు లేరు. ఒకదాంట్లో ప్యాంట్రీ(క్యాంటీన్) ఉండగా మరోదాంట్లో లగేజ్ ఉంది. దీంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఆ రెండు బోగీల్లోనూ ప్రయాణికులు ఉండి ఉంటే మరణాల సంఖ్య భారీగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News