Rahul Gandhi : హనుమాన్ గుడిలో రాహుల్ పూజలు

Update: 2024-05-21 07:04 GMT

యూపీ రాయ్ బరేలీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సందడి చేస్తున్నారు. ప్రచారంలో జోరు పెంచారు. సోమవారం రాయబరేలిలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు.

ప్రస్తుత లోకసభ ఎన్నికల్లో ఐదవ దశ పోలింగ్ సోమవారం రాయబరేలిలో జరిగింది. తాను పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను కూడా ఆయన సందర్శించారు. రాయబరేలికి ఇంతకుముదు ఆయన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు.

హనుమాన్ ఆలయంలో రాహుల్ అర్చన జరిపారు. ఆయన ఒక పోలింగ్ కేంద్రాన్ని సందర్శించినప్పుడు సెల్ఫీ కోసం పలువురు ఆయన చుట్టూ చేరారు. మీడియా సిబ్బంది కొందరు ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ ఆయన సైలెంట్ గా వెళ్లిపోయారు.

Tags:    

Similar News