సంగీత ప్రపంచం మూగబోయింది. ఆరు దశాబ్దాల పాటు తబలా ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) తుదిశ్వాస విడిచారు. మూడేళ్ల వయస్సులోనే తబలా వాయించారాయ.. ఏడేండ్ల వయస్సులోనే బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టారు. 12 ఏళ్లకే అంతర్జాతీయ సంగీత కచేరీలు ప్రారంభించారు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు. సంగీతంలో రాణిస్తూనే చదువుపైనా శ్రద్ధ పెట్టారు. ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన రెండు వారాల క్రితం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తబలా మ్యాస్ట్రోగా ప్రఖ్యాతిగాంచిన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబయిలో జన్మించారు. ప్రముఖ ఉస్తాద్.
తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన జాకీర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. ఏడేండ్ల వయస్సు నుంచి తండ్రి వద్ద శిష్యరికం చేశారు. ఆ తర్వాత హిందూస్థానీ సంగీతంలో పండితులైన అనేకమంది సంగీత కళాకారులతో కలిసి పని చేశారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు. 1990లో సంగీత్నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది. జాకీర్ హుస్సేన్ భారత్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. జాకీర్ హుస్సేన్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కల్యాణ్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, సుప్రసిద్ధ నటుడు కమలహా సన్, ఏఆర్ రెహమాన్ సంతాపం తెలిపారు. సంగీత ప్రపం చానికి జాకీర్ హుస్సేన్ మృతి తీరని లోటని కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు.