Congress : కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా

Update: 2024-05-09 05:24 GMT

కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు. ఇటీవల ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వాటిపై మోదీ సహా బీజేపీ నేతల నుంచి విమర్శలు రావడంతో పదవి నుంచి తప్పుకున్నారు. పిట్రోడా రాజీనామాను AICC అధ్యక్షుడు ఖర్గే కూడా ఆమోదించారు. ఇటీవల వారసత్వ పన్నుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. అవి మరువక ముందే తాజాగా జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంపై దుమారం రేగింది.

శామ్ పిట్రోడా ఒడిశాలోని టిట్లాగఢ్‌లో 1942లో జన్మించారు. అక్కడే ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లిన ఆయన టెక్నాలజీ నిపుణుడిగా పేరొందారు. ఇది గుర్తించిన ఇందిరా గాంధీ 1984లో ఇండియాకు ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఇందిరా, రాజీవ్, యూపీఏ ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. సీ-డాట్ ఆయన హయాంలోనే మొదలైంది. ఎస్టీడీ బూత్‌ల ఏర్పాటు ఆయన ఆలోచనే. 1992లో ఐక్యరాజ్య సమితిలోనూ పనిచేశారు.

Tags:    

Similar News