Sevaratna Award : సేవామూర్తికి ‘సేవారత్న’ అవార్డు!

Update: 2024-07-09 05:44 GMT

రూపాయికే ఇడ్లీలను అందిస్తూ ఎంతోమంది కడుపు నింపుతోన్న తమిళనాడుకి చెందిన 84 ఏళ్ల కమలతల్‌ను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మంత్రులు సత్కరించారు. ఓ ప్రైవేటు అవార్డుల వేడుకలో ఆమెను ‘సేవారత్న’తో సత్కరించి రూ.50వేల సాయాన్ని అందించారు. గత 35 ఏళ్లుగా ఆమె రూ.1కే ఇడ్లీలు అందిస్తున్నారు. 600ప్లేట్లు విక్రయిస్తూ తన అవసరాల కోసం రూ.100 చొప్పున ఆదా చేస్తున్నారు. ఆమెను అభినందించాల్సిందేనంటూ IAS జయేశ్ రంజన్ ఫొటోలను Xలో పంచుకున్నారు.

వడివేలంపాలయం గ్రామంలో నివసిస్తున్న కె.కమలతల్ ఒక ఇడ్లీని రూపాయి చొప్పున విక్రయిస్తోంది. అయితే, ఆమె లాభాలను ఆర్జించేందుకు ఆ ఇడ్లీలను విక్రయిస్తుందని అనుకుంటే పొరపాటే. కష్టపడి జీవించే డైలీ వర్కర్ల సంపాదనంతా కేవలం ఆహారానికే ఖర్చు కాకూడదనే ఉద్దేశంతో ఇడ్లీలను విక్రయిస్తోంది. ఈ వ్యాపారం ప్రారంభించి దశాబ్దాలు దాటినా ఆమె ఇడ్లీ ధరలు పెంచకపోవడం గమనార్హం. నిత్యవసరలు ధరలు భగ్గుమన్నా సరే.. కమలతల్ హోటల్‌లో ఇడ్లీ ధర పెరగదు.

 

Tags:    

Similar News