SBI New Branches : కొత్తగా 400 ఎస్బీఐ బ్రాంచ్‌లు

Update: 2024-06-24 07:29 GMT

దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( State Bank Of India ) విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 400 శాఖలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా వెల్లడించారు.

గతేడాది 137 కొత్త శాఖలు తెరిచామని, ఈసారి దానికి మూడురెట్లు కొత్త శాఖలు ప్రారం భిస్తామని చెప్పారు. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న క్రమంలో కొత్త శాఖల ఏర్పాటు ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారని, అయితే బ్యాంకింగ్ లో కొత్త విభాగాలు పుట్టుకొస్తున్నందున మరిన్ని బ్రాంచీలు అవసరమని తెలిపారు. 89శాతం బ్రాంచ్ లో 98శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి.

అవకాశాలున్న ప్రాంతాలను గుర్తించి కొత్త బ్రాంచ్ లను ఏర్పాటు చేస్తామన్నారు సంస్థ చైర్మన్. అనుబంధ కార్యకలాపాలను మరింత పెంచడం ద్వారా వాటి విలువ పెరుగుతుందని వివరించారు.

Tags:    

Similar News