మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి(CS)గా సీనియర్ IAS సుజాతా సౌనిక్ ( Sujata Saunik ) ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర 64 ఏళ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఈమె హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కాగా ఆమె భర్త మనోజ్ సౌనిక్ కూడా గతంలో CSగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
దక్షిణ ముంబైలోని రాష్ట్ర సచివాలయం మంత్రాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సౌనిక్ బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర చరిత్రలో అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. 1987 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సుజాత మరో ఏడాది పాటు పదవిలో ఉంటారు. ఆమె భర్త మనోజ్ సౌనిక్ కొన్నేళ్ల క్రితం ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.