Karur Stampede: కరూర్ తొక్కిసలాటపై కీలక పరిణామం..
సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు
కరూర్ తొక్కిసలాట ఘటనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ టీవీకే అధినేత, నటుడు విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీం ధర్మాసనం కీలన నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి.. సీబీఐ విచారణను పర్యవేక్షిస్తారని తెలిపింది. కమిటీలో తమిళనాడుకు చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు గానీ.. స్థానికులు ఉండొచ్చని స్పష్టం చేసింది. దర్యాప్తు పురోగతిని సీబీఐ అధికారులు నెలవారీ నివేదికలు కమిటీకి సమర్పించాలని తెలిపింది.
సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్దీ గాయాలు పాలయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో మద్రాస్ హైకోర్టు సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా సీబీఐ విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది.