ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క చెందిన 'టెస్లా' ఇండియాలో ప్రవేశిస్తోంది. మొదటి TESLA షోరూమ్ ను ముంబైలోని బాంద్రా కుర్ల కాంప్లెక్స్లో ప్రారంభించనుంది. ఇందుకోసం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వాణిజ్య టవర్ లో 4వేల చదరపు అడుగుల స్థలాన్ని ఐదేళ్లపాటు లీజుకు తీసుకుంది. నెలకు రూ.35 లక్షల మేర అద్దె చెల్లించనుంది. ఈ మేరకు సదరు స్థల యజమానికి టెస్లా ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడే 'టెస్లా ' ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థృతన మోడల్ ను ప్రదర్శించ నుంది. బెర్లిన్ నుంచి 'టెస్లా' కార్లను దిగుమతి చేసుకుని విక్రయించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భవిష్యత్లో భారత్లోనే టెస్లా కార్ల తయారీ యూనిట్ పెట్టనుంది. 'టెస్లా ' కోసం దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 'టెస్లా'కు అవసరమైన భూమి, అనుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించింది కూడా. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కూడా టెస్లా కార్ల షోరూంను ఏర్పాటు చేయనుంది. ఢిల్లీ ఎయిరోసిటీ కాంప్లెక్స్లోలో రెండో షోరూమ్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ప్రధాని మోడీ వాషింగ్టన్ పర్యట నలో ఎలాన్ మస్క్ భేటీ కాగా, ఇండియాలో టెస్లా కార్ల ఉత్పత్తుల అమ్మకానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా రిక్రూట్ మెంట్ కూడా ప్రారంభించారు. లింక్డ్ ఇన్ పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాలకు కోసం నోటిఫికేషన్ ఇచ్చింది.