Centre Releases Funds : తెలుగు రాష్ట్రాలకు నిధులు రిలీజ్ చేసిన కేంద్రం

Update: 2025-02-20 06:00 GMT

కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు విపత్తు, వరదల సాయం కింద నిధులు విడుదల చేసింది. ఏపీకి అత్యధికంగా రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు రిలీజ్ చేసింది. ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల చేశారు.

2024లో వరదలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా ప్రభావితమైన రాష్ట్రాలకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం అదనంగా రాష్ట్రాలకు ఈ నిధులను అందజేస్తోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గత కొంతకాలంగా వరదలు, తుఫానులు, భారీ వర్షాల వల్ల తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో గోదావరి, కృష్ణా నదుల్లో వచ్చిన వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి, వేలాది కుటుంబాలు తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది.

ఇదే విధంగా, తెలంగాణలోనూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లకు, రహదారులకు, వంతెనలకు భారీగా నష్టం జరిగింది. ఈ నిధులు మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు, పునర్నిర్మాణ పనులకు ఉపయోగపడతాయని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News