Tragic Incident : కొండచరియలు విరిగిపడి నలుగురు కూలీలు మృతి

Update: 2024-02-28 10:30 GMT

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ లోని దంతెవాడ జిల్లా ఇనుప ఖనిజం గని ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో నలుగురు కూలీలు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలైనట్లు పోలీసు అధికారి తెలిపారు. మృతులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిట్టు బాలా (26), తుషార్ బాలా (49), నిర్మల్ బాలా (56), బీహార్‌కు చెందిన సంతోష్ కుమార్ దాస్ (29)గా గుర్తించారు.

విచారణ ప్రారంభం

అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆర్కే బర్మన్ తెలిపిన వివరాల ప్రకారం, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండిసి) స్క్రీన్ ప్లాంట్-03 ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్ట్‌లో భాగంగా కిరండూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల్లో ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు ఈ సంఘటన జరిగింది.

ఆ స్థలంలో పనిచేస్తున్న నలుగురు కూలీలపై బండరాయి పడి శిథిలాల కింద కూరుకుపోయి మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఘటనాస్థలికి చేరుకుని చిక్కుకుపోయిన కూలీలను రక్షించే ప్రయత్నం చేసింది. ఆరు గంటల తర్వాత నలుగురు కూలీల మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News