Anant Ambani Wedding : అంబానీపై ట్రోల్స్.. కొడుకు పెళ్లి ఖర్చును మా మీద వేస్తున్నావా?
రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘కొడుకు పెళ్లి ఖర్చు మొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీ ( Mukesh Ambani ) మావా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘ఎన్నికలు అయిపోయాయి కదా ఇక బాదుడే బాదుడు’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య జియో సిగ్నల్ కూడా సరిగా రావట్లేదని ఫైరవుతున్నారు.
జియో మొబైల్ రీఛార్జి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఉన్న కనిష్ఠ నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను జియో రూ.155 నుంచి రూ.189కి పెంచింది. ప్లాన్‌ను బట్టి ఈ పెంపు కనిష్ఠంగా రూ.34 నుంచి గరిష్ఠంగా రూ.600 వరకు ఉంది. మరోవైపు 1 జీబీ డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జి ధరను రూ.15 నుంచి రూ.19కి పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది.
సిగ్నల్ సరిగా రాకపోవడం, రీఛార్జ్ ధరలు పెంచేయడంతో జియో యూజర్లు Airtelకు మారుదామనుకున్నారు. తాజాగా Airtel కూడా ధరలు పెంచడంతో యూజర్లు షాక్‌లో ఉన్నారు. ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ BSNL బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా BSNL 4G సేవలు ప్రారంభం కానున్నాయి. దీంతో నెట్‌వర్క్ మారిపోవడం బెటర్ అని, 5G తెస్తే ఇంకా మేలని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం.