SEBI Chief : SEBI చీఫ్‌గా తుహిన్ కాంత పాండే

Update: 2025-02-28 08:15 GMT

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) చీఫ్‌గా తుహిన్ కాంత పాండేను కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. తుహిన్ సెబీ ఛైర్మన్‌‌గా మూడేళ్లు పదవిలో ఉండనున్నారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న మాధవి పురీ బుచ్ పదవీకాలం నిన్నటితో ముగిసింది. కాగా ఇటీవల ఆమె తీవ్ర ఆర్థిక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒడిశా కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన గతంలో ఆర్థిక కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు. ఎయిరిండియా ప్రైవేటీకరణలో పాండే కీలక పాత్ర పోషించారు. తుహిన్ కాంత పాండేకు ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌లో విస్తృత అనుభవం ఉంది.

Tags:    

Similar News