Stalin : ఉదయనిధి స్టాలిన్‌కు బీహార్‌ కోర్టు సమన్లు

Update: 2024-03-13 07:06 GMT

తమిళనాడు క్రీడా మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌కు (Udhayanidhi Stalin) బీహార్‌లోని ఒక కోర్టు సమన్లు జారీ చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉదయనిధి వ్యాఖ్యలు ఉన్నాయని న్యాయవాది ధర్నింధర్‌ పాండే ఈ పిటీషన్‌ వేశారు. దీనిని బీహార్‌లోని ఆరా కోర్టు విచారించింది. మంగళవారం ప్రారంభమైన ట్రయల్స్ లో కీలక వ్యాఖ్యలు చేసింది.

తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కు చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ మనోరంజన్‌ కుమార్‌ ఝా సమన్లు జారీ చేశారు. తదుపరి విచారణను ఏప్రిల్‌ 1కు వాయిదా వేశారు.

2023 సెప్టెంబర్‌ 2న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ కాంట్రవర్సియల్ స్టేట్ మెంట్ ఇచ్చారు. సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీలాంటి రోగమని.. దానిని అందరం తరిమికొట్టాలని స్టాలిన్ అన్నారు. చాలామంది హిందువుల మనోభావాలు ఈ కామెంట్లతో దెబ్బతిన్నాయి. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News