లోక్ సభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు యూపీ బీజేపీకి ఇప్పటికీ మింగుడపడటం లేదు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం అధికారులతో సమావేశమయ్యారు. ప్రజావాణికి సంబంధించిన పనులన్నింటినీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఖాళీగా ఉన్న పోస్టుల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు యోగీ. లక్నోలోని కాళి దాస్ మార్గ్ లోని తన అధికారిక నివాసంలో 'జనతా దర్శన్' ప్రజా ఫిర్యాదుల సమావేశంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత బడ్జెట్లో నిధులను అన్ని శాఖలు సక్రమంగా ఖర్చు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు.
సమయ పాలన, పంక్చువేషన్ ను తన మీటింగ్ లో హైలైట్ చేశారు సీఎం యోగీ. క్రమశిక్షణ తప్పితే మాత్రం చర్యలు తప్పవన్నారు.