యూఎస్‌లో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థుల కోసం అమెరికా ప్రభుత్వం ఈనెల 31 వరకు వీసా స్లాట్స్‌ను విడుదల చేసింది. ఢిల్లీలోని US రాయబార కార్యాలయంతో పాటు హైదరాబాద్ , చెన్నై, ముంబై, కోల్‌కతా కాన్సులేట్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. వీటికోసం విద్యార్థులు ఆన్లైన్లో స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈనెల మూడో వారంలో జూన్ నెల స్లాట్లు, అక్టోబర్‌లో పర్యాటక వీసాల స్లాట్లు అందుబాటులోకి వస్తాయని సమాచారం.
విద్యార్థి వీసాల జారీ అనంతరం పర్యాటక వీసాలు (బీ1, బీ2) అందుబాటులోకి వస్తాయని సమాచారం. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ రెండో వారంలోగా విద్యార్థి వీసాల ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తరువాత సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్‌లో పర్యాటక వీసా స్లాట్ల జారీ అవనున్నట్టు తెలుస్తోంది. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే పర్యాటక వీసా ప్రక్రియ పూర్తి చేయాలనేది అక్కడి ప్రభుత్వ ఆలోచనగా ఉంది.