Aishwarya Rai: అప్పటికీ.. ఇప్పటికీ.. మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్..
Aishwarya Rai: అందం, ఐశ్వర్యా రాయ్.. ఈ రెండు పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగించవచ్చు.;
Aishwarya Rai (tv5news.in)
Aishwarya Rai: అందం, ఐశ్వర్యా రాయ్.. ఈ రెండు పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగించవచ్చు. ఆమె 26 సంవత్సరాల మందు మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించినా.. ఇప్పటికీ గ్లామర్ ప్రపంచానికి మకుటం లేని మహారాణిగా వెలిగిపోతోంది. గ్లామర్ ప్రపంచానికే తన అందంతో వన్నెతెచ్చిన ఐశ్వర్య రాయ్ పుట్టినరోజు నేడు.
మిస్ వరల్డ్‌గా గెలిచిన తర్వాత దాదాపు ప్రతీ భాషా పరిశ్రమ నుండి ఐశ్వర్య రాయ్‌కు ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన ఆఫర్లలో తాను ముందుగా కోలీవుడ్‌లోనే అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది.
'ఇరువర్' అనే తమిళ చిత్రంలో మొదటిసారిగా హీరోయిన్‌గా మెరిసింది ఐశ్వర్య రాయ్. మొదటి సినిమాలోనే తన యాక్టింగ్‌తో దర్శకుడు మణిరత్నంను మెప్పించింది.
ఇరువర్ విడుదలయిన వెంటనే ఐశ్వర్యాకు బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చింది. 'ఔర్ ప్యార్ హో గయా' చిత్రంలో బాబీ డియోల్ సరసన నటించి హిందీ ప్రేక్షకులను పలకరించింది.
అలా హిందీ, తమిళ చిత్రాల్లోనే బిజీ అయిన ఐశ్వర్యా రాయ్.. తెలుగులో నేరుగా సినిమాలు చేయలేదు. కానీ నాగార్జున హీరోగా తెరకెక్కిన 'రావోయి చందమామ' చిత్రంలో ఒక పాటలో అలా మెరిసింది ఐశ్వర్య.
2007లో ఐశ్వర్య రాయ్.. బాలీవుడ్ బిగ్ బి కొడుకు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ను మొదలుపెట్టింది.
పెళ్లయిన కొన్ని సంవత్సరాల వరకు ఐశ్వర్య రాయ్ సినిమాలకు దూరంగా ఉన్నారు. సినిమా ఆఫర్లు వస్తున్నా.. అవి కాదని ఫ్యామిలీ లైఫ్‌లోనే బిజీ అయిపోయారు.
పెళ్లయిన తర్వాత 'రోబో, విలన్, జోధా అక్బర్' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించింది ఐశ్వర్య.
దాదాపు అయిదు సంవత్సరాల తర్వాత 'జజ్బా' అనే థ్రిల్లర్‌తో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది ఐశ్వర్య. ఆ సినిమా ఆశించినంత ఫలితాలను ఇవ్వకపోయినా ఐశ్వర్య రీ ఎంట్రీ మాత్రం తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది.
తన 47వ ఏట అడుగుపెడుతున్నా కూడా ఐశ్వర్యా రాయ్ తమకు ఇంకా మిస్ వరల్డే అంటూ ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.