Alia Bhatt: 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్‌కు గ్లామర్ యాడ్ చేసిన ఆలియా భట్..
Alia Bhatt: ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత మహేశ్ భట్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆలియా భట్.;
Alia Bhatt (tv5news.in)
Alia Bhatt: ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత మహేశ్ భట్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆలియా భట్. తక్కువ సమయంలోనే మెస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో తెలుగులోకి కూడా అడుగుపెట్టనుంది.
జనవరి 7న 'ఆర్ఆర్ఆర్' చిత్రం విడుదల కానుంది. అందుకే మూవీ టీమ్ ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉంది. ఆలియా భట్ కూడా ఈ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటోంది.
'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్‌లో ఆలియా భట్ తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. తన డ్రెస్సింగ్ కూడా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటోంది. ఒకసారి శారీతో, ఒకసారి సల్వార్‌తో చూసేవారిని కట్టిపడేస్తోంది.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆలియా.. రామ్ చరణ్‌కు జోడీగా, సీతగా నటిస్తోంది.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుండి విడుదలయిన ఆలియా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
కేవలం 10 రోజుల షూటింగ్‌కు ఆలియా రూ. 5కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం.
ఆలియా భట్‌తో పాటు బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ కూడా ఆర్ఆర్ఆర్‌లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో ఆలియా భట్ తెలుగులో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.