Ananya Nagalla: 'వకీల్ సాబ్'లో మెరిసిన తెలుగమ్మాయి.. ఇప్పుడేం చేస్తోందంటే..?
Ananya Nagalla: పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన అనన్య.. ‘మల్లేశం’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యింది.;
Ananya Nagalla: ఎన్నో షార్ట్ ఫిల్మ్స్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఈరోజు ఈ తెలుగమ్మాయి పుట్టినరోజు సందర్భంగా తన తరువాతి సినిమా అప్డేట్ రిలీజ్ అయ్యింది.
పలు పెద్ద యూట్యూబ్ ఛానెళ్లలలో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన అనన్య.. 'మల్లేశం' అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యింది.
మొదటి సినిమాలోనే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎంచుకుంది.
మల్లేశంలో అనన్య పోషించిన పద్మ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆ తర్వాత మరో చిత్రంలో కూడా హీరోయిన్‌గా చోటు దక్కించుకుంది.
ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్'తో అనన్య ఫేట్ మారిపోయింది.
వకీల్ సాబ్‌లో ముగ్గురు హీరోయిన్లు ఉండగా.. అనన్య కూడా అందులో ఒకరు.
ప్రస్తుతం సమంత నటిస్తున్న 'శాకుంతలం' ఓ పాత్ర చేస్తోంది అనన్య.
అంతే కాకుండా 'లేచింది మహిళా లోకం' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో తాను కూడా ఓ హీరోయిన్‌గా నటిస్తోంది.
అనన్య పుట్టినరోజు సందర్భంగా లేచింది మహిళా లోకం చిత్రం నుండి తన ఫస్ట్ లుక్ విడుదలయ్యింది.
సినిమా అవకాశాలు లేకపోయినా తన ఫోటోషూట్స్‌తో అమ్మడు ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది.
పూర్తిగా గ్లామర్ ఫోటోషూట్స్‌పై అనన్య ఫోకస్ పెట్టింది.
గ్లామర్ డోస్ పెంచేసి అనన్య పోస్ట్ చేస్తున్న ఫోటోలు నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.