Ananya Panday: అనన్య పాండే.. యంగ్ బ్యూటీ బ్యూటిఫుల్ ఫోటోస్..
Ananya Panday: బాలీవుడ్‌లో టాప్ ప్లేస్‌ను దక్కించుకోవడానికి ఎంతోమంది యంగ్ హీరోయిన్లు పోటీపడుతున్నారు.;
Ananya Panday (tv5news.in)
Ananya Panday: బాలీవుడ్‌లో టాప్ ప్లేస్‌ను దక్కించుకోవడానికి ఎంతోమంది యంగ్ హీరోయిన్లు పోటీపడుతున్నారు. వారిలో ఇటీవల కాలంలో బీ టౌన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నటి అనన్య పాండే.
అనన్య తండ్రి చుంకీ పాండే కూడా బాలీవుడ్ సినిమాల్లోనే నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. వందకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు చుంకీ పాండే.
2019లో విడుదలయిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యింది అనన్య పాండే.
మొదటి సినిమాకే బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్‌గా ఫిల్మ్‌ఫేర్‌ను, జీ సినీ అవార్డులను దక్కించుకుంది అనన్య.
ఆ తర్వత కార్తిక్ ఆర్యన్ హీరోగా వచ్చిన 'పతీ పత్నీ ఔర్ వో' చిత్రంలో అనన్య సెకండ్ హీరోయిన్‌గా నటించి మంచి హిట్‌ను సొంతం చేసుకుంది.
అనన్య పాండే చివరి సినిమా ఇషాన్ కత్తర్ సరసన 'ఖాళీ పీలీ' ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది.
హిందీలో చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులలో అనన్యకు చాలానే పాపులారిటీ వచ్చేసింది. అందుకే విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న 'లైగర్'లో లీడ్‌గా ఎంపికైంది అనన్య పాండే.