Annie: 'రాజన్న'లో మల్లి పాత్ర పోషించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్‌గా..

Annie: 2011లో విడుదలయిన రాజన్న చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన అనీ అందరి దృష్టిని ఆకర్షించింది.

Update: 2022-01-18 08:37 GMT

Annie (tv5news.in)

Annie: చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరో, హీరోయిన్‌గా ఎదిగినవారు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం అలా మారుతున్న చైల్డ్ ఆర్టిస్ట్ అన్నీ. అన్నీ ఎవరో తెలియని వారికి తానెవరో పరిచయం చేయాలంటే ముందుగా చెప్పాల్సిన సినిమా 'రాజన్న'.



2011లో విడుదలయిన రాజన్న చిత్రంతో అన్నీ చైల్డ్ ఆర్టిస్టులు అందరిలో తనదైన ముద్రవేసింది.



2005లో చైల్ట్ ఆర్టిస్ట్‌గా అన్నీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన తల్లిదండ్రులు మలయాళం వారు అయినా.. హైదరాబాద్‌లోనే సెటిల్ అయిపోవడంతో అన్నీకి తెలుగు బాగా వచ్చు.


4 ఏళ్ల వయసులోనే కెరీర్‌ను స్టార్ట్ చేసిన అన్నీ ఖాతాలో ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు మూడు నంది అవార్డులు కూడా ఉన్నాయి.


రాజన్న తర్వాత అన్నీ మళ్లీ చెప్పుకోదగిన సినిమాలు ఏమీ చేయలేదు.


చాలాకాలం తర్వాత 'లూసర్ 2' అనే వెబ్ సిరీస్‌లో లీడ్‌గా మళ్లీ ప్రేక్షకులను పలకరించింది అన్నీ.


వెండితెరకు దూరంగా ఉన్నా అన్నీ.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. 











Tags:    

Similar News