Daksha Nagarkar: చైతూకు ఒక్క స్మైల్ ఇచ్చి ఫేమస్ అయిపోయిన దక్షా నాగర్కర్..
Daksha Nagarkar: దక్షా ఎవరో చాలామంది ప్రేక్షకులకు తెలియదు. కానీ ఇటీవల వైరల్ అయిన ఓ వీడియో వల్ల అందరికీ పరిచయమయ్యింది.;
Daksha Nagarkar (tv5news.in)
Daksha Nagarkar: ఇండస్ట్రీకి రోజుకు ఎంతోమంది హీరోయిన్లు కొత్తగా పరిచమయమవుతుంటారు. అందులో కొంతమందికి మాత్రమే టాలెంట్‌తో పాటు లక్ కలిసొచ్చి క్లిక్ అవుతుంటారు. అలాంటి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న ఓ హీరోయిన్ దక్షా నగార్కర్.
దక్షా అంటే ఎవరో చాలామంది ప్రేక్షకులకు తెలియదు. కానీ ఇటీవల వైరల్ అయిన ఓ వీడియో తనను అందరికీ పరిచయం చేసేసింది.
నాగార్జున, నాగచైతన్య చేస్తున్న మల్టీ స్టారర్ 'బంగార్రాజు'లో దక్షా నగార్కర్ ఓ చిన్న పాత్ర పోషించింది.
ఇటీవల జరిగిన బంగార్రాజు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చైతూను చూసి ఓ స్మైల్ ఇచ్చింది దక్షా. అంతే ఆ వీడియో కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా అంతా విపరీతంగా వైరల్ అయ్యింది.
2007లో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తన మొదటి చిత్రం కన్నడలో చేసిన 'మలెనాడ మల్లిగే'.
ఆ తర్వాత సీనియర్ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన అందమైన ప్రేమకథ 'హోరాహోరీ'లో నటించి తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
మొదటి సినిమా కమర్షియల్‌గా అంతగా హిట్ అవ్వలేదు. అందుకే తనకు మరో సినిమా అవకాశం రావడానికి చాలానే సమయం పట్టింది.
'హుషారు' అనే యూత్‌ఫుల్ లవ్‌స్టోరీలో తాను ఓ హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపును అందుకుంది.
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'జాంబీ రెడ్డి'తో అందరి కంట్లో పడింది.
ఇప్పుడు బంగార్రాజుతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది దక్షా నాగర్కర్.