Deepika Padukone: బాలీవుడ్ గ్లామర్ క్వీన్ దీపికా పదుకొనె.. ఎవర్‌గ్రీన్ ఫోటోస్..
Deepika Padukone: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె.. గత కొంతకాలంగా మకుటం లేని మహారాణిగా ఇండస్ట్రీలో వెలిగిపోతోంది.;
Deepika Padukone (tv5news.in)
Deepika Padukone: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ దీపికా పదుకొనె.. గత కొంతకాలంగా మకుటం లేని మహారాణిగా ఇండస్ట్రీలో వెలిగిపోతోంది. పోటీని అంతా దాటుకొని బాలీవుడ్‌లో టాప్ స్థానాన్ని దక్కించుకున్న దీపికా పదుకొనె పుట్టినరోజు నేడు.
ఒకప్పుడు బాలీవుడ్‌లో దీపికా పదుకొనె వర్సెస్ ప్రియాంక చోప్రా అనే పోటీ నడుస్తున్న సమయంలో ప్రియాంకను దాటుకుని మరీ ముందుకు దూసుకెళ్లింది దీపికా.
ఇంట్రెస్టింగ్ రోల్స్‌ను ఎంచుకుంటూ బాలీవుడ్‌లోని టాప్ డైరెక్టర్లతో పనిచేసింది దీపికా.
ఇన్నాళ్లు బాలీవుడ్‌లో స్టార్‌గా మెరిసిన దీపికా.. త్వరలోనే టాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టనుంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సరసన 'ప్రాజెక్ట్ కే' అనే చిత్రంలో నటిస్తోంది.
తమిళంలో ఇప్పటికే రజినీకాంత్ సరసన 'కొచ్చడయాన్' అనే చిత్రంలో నటించింది దీపికా.
తనతో కలిసి రెండు సినిమాల్లో నటించిన రణవీర్ సింగ్‌నే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని స్టార్ట్ చేసింది దీపికా.
హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ.. ఇప్పటికీ దీపికా వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా గడిపేస్తోంది.