Disha Patani: దిశా పటాని బర్త్ డే.. బాయ్‌ఫ్రెండ్ స్పెషల్ విషెస్..
Disha Patani: నేడు దిశా పుట్టినరోజు సందర్భంగా టైగర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.;
Disha Patani: మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి మెల్లగా వెండితెర వైపు అడుగులేసింది దిశా పటాని.
దిశాకు హీరోయిన్‌గా ముందు అవకాశం ఇచ్చింది టాలీవుడే.
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' సినిమాతో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది దిశా.
లోఫర్ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో దిశాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
అప్పుడే ఎమ్ ఎస్ ధోనీ బయోపిక్‌లో దిశాకు అవకాశం వచ్చింది.
ఎమ్ ఎస్ ధోనీ సినిమా హిట్ అవ్వడంతో దిశాకు తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాలతో దిశా బాలీవుడ్‌లోనే బిజీ అయిపోయింది.
'బాగీ 2' షూటింగ్ సమయంలో టైగర్ ష్రఫ్‌తో ప్రేమలో పడింది దిశా.
వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరిగి వీరి రిలేషన్‌షిప్‌ను అఫీషియల్ చేసేశారు.
కానీ నేడు దిశా పుట్టినరోజు అయినా కూడా టైగర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి వదిలేశాడు.
దిశా పటానీ మాత్రం టూర్‌ల్లో బిజీగా ఉంది.
నేను, నా బటర్ ఫ్లై వెళ్తున్నాం అంటూ ఓ పోస్ట్ పెట్టింది దిశా.
దీంతో దిశాకు, టైగర్‌కు బ్రేకప్ అయ్యిందా? దిశా వేరొకరితో రిలేషన్‌లో ఉందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.