Divya Bharathi: ట్రెండ్ క్రియేట్ చేస్తున్న 'బ్యాచిలర్' పిల్ల.. త్వరలో తెలుగులో కూడా..
Divya Bharathi: కోలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఉన్నట్టుండి ట్రెండ్ అయిపోయిన హీరోయిన్ దివ్య భారతి.;
Divya Bharathi (tv5news.in)
Divya Bharathi: కేవలం ఒక్క సినిమాతోనే ట్రెండ్ చేసేస్తున్నారు హీరోయిన్లు. తాజాగా అలా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఉన్నట్టుండి ట్రెండ్ అయిపోయిన హీరోయిన్ దివ్య భారతి. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విటర్‌లో ఎక్కడ చూసినా.. తన గురించే, తన సినిమాలోని పాటే కనిపిస్తోంది.
'బ్యాచిలర్' సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ తెలియకపోవచ్చు. కానీ 'అడియే' పాట వింటే మాత్రం ఈ హీరోయిన్ టక్కున గుర్తొస్తుంది.
దివ్య భారతికి బ్యాచిలర్ సినిమా ఒక్కటి కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అందుకే కేవలం తమిళంలోనే కాదు తెలుగులో కూడా తనకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
బ్యాచిలర్ సినిమాలో తనను చూసిన తెలుగు దర్శక నిర్మాతలు వెంటనే తనను తెలుగులో కూడా పరిచయం చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టేశారు.