Eesha Rebba: ఆ యంగ్ హీరోతో సినిమా క్యాన్సిల్ అయ్యింది: ఈషా రెబ్బా
Eesha Rebba: హీరోయిన్‌గా అవకాశాలు తక్కువ అవ్వడంతో పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింతి ఈషా రెబ్బా;
Eesha Rebba (tv5news.in)
Eesha Rebba: టాలీవుడ్‌లో హీరోయిన్లుగా వెలిగిపోతున్న తెలుగమ్మాయిలు చాలా తక్కువమంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ఈషా రెబ్బా. మంగళవారం ఈషా రెబ్బా పుట్టినరోజు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' చిత్రంలో బ్యాక్‌గ్రౌండ్ యాక్టర్‌గా నటించింది ఈషా.
ఆ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంతో వచ్చిన 'అంతకు ముందు ఆ తర్వాత'తో హీరోయిన్‌గా మారింది.
ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకున్నా.. అందులో చాలావరకు చిత్రాలు అనుకున్నంత రేంజ్‌లో విజయం సాధించకపోవడంతో వెనకబడింది.
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోనే ఈషా మూడు సినిమాల్లో నటించింది.
ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో తాను నటించిన సినిమాల్లో 'అమీ తుమీ' తన ఫేవరెట్ అని తెలిపింది ఈషా.
హీరోయిన్‌గా అవకాశాలు తక్కువ అవ్వడంతో 'అరవింద సమేత', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'లాంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింతి ఈషా రెబ్బా.
అయితే ఎన్నో సినిమా అవకాశాలు తన చేతివరకు వచ్చి.. మధ్యలో ఆగిపోయాయని ఈషా బయటపెట్టింది.
యంగ్ హీరో నాగశౌర్యతో ఒక సినిమా చేయాల్సి ఉన్నా.. అది ఎందుకో వర్కవుట్ అవ్వలేదని వెల్లడించింది ఈషా రెబ్బా.