Genelia: జెనీలియా బర్త్ డే.. భర్త నుండి అందుకున్న అతిపెద్ద గిఫ్ట్ అదేనట..!
Genelia: ఒకే సంవత్సరం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రికార్డ్ జెనీలియా సొంతం.;
Genelia: తెలుగులో వచ్చిన 'బొమ్మరిల్లు' చిత్రాన్ని, అందులోని హాసిని పాత్రను ఎన్ని సంవత్సరాలైనా ఎవరూ మర్చిపోలేరు. దానికి కారణం జెనీలియా నటనే అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఈరోజు ఈ అందాల హాసిని పుట్టినరోజు.
ఒకే సంవత్సరం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రికార్డ్ జెనీలియా సొంతం.
ముఖ్యంగా తెలుగులో జెనీలియా నటించిన ప్రతీ పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి.
రానాతో జతకడుతూ జెనీలియా చేసిన 'నా ఇష్టం' సినిమానే తనకు తెలుగులో ఆఖరి చిత్రం.
'తుజే మేరీ కసమ్' చిత్రంతో హిందీలో హీరోయిన్‌గా పరిచయమయిన జెనీలియా.. ఆ తర్వాత ఆ మూవీ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌నే ప్రేమించి పెళ్లి చేసుకుంది.
వీరిద్దరూ పెళ్లి చేసుకునే వరకు వీరి ప్రేమ గురించి ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యం.
జెనీలియా, రితేష్‌కు తొమ్మిదేళ్లు ఏజ్ గ్యాప్ ఉన్నా ఇప్పటికీ బాలీవుడ్‌లో క్యూట్ కపుల్స్‌లో వీరు కూడా ఒకరు.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఓ అభిమాని రితేష్ నుండి మీరు అందుకున్న అతిపెద్ద గిఫ్ట్ ఏంటని అడిగారు. దానికి సమాధానంగా తన కొడుకులు రియాన్, రాహిల్ ఫోటోలను పోస్ట్ చేసింది జెనీలియా.
ఇక చాలాకాలం తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి జెనీలియా సిద్ధమవ్వడం తన ఫ్యాన్స్‌నను హ్యాపీ చేస్తోంది.