Celebrities Pongal Celebration 2022: సెలబ్రిటీల ఇంట సంక్రాంతి సంబరాలు.. ఫోటోలు వైరల్..
Celebrities Pongal Celebration 2022: సెలబ్రిటీలు.. తాము పండుగను ఎలా జరుపుకున్నారో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు.;
Celebrities Pongal Celebration 2022: ఏ పండుగ వచ్చినా.. సినీ సెలబ్రిటీలు.. తాము పండుగను ఎలా జరుపుకున్నారో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు. ఆ ఫోటలు చూసి వారి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవ్వడమే కాకుండా వాటిని షేర్‌ల మీద షేర్‌లు చేస్తుంటారు. ఈ సంక్రాంతికి టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు షేర్ చేసిన ఫోటోలివి.
ఈ సంక్రాంతిని తన కుటుంబంతో సంతోషంగా జరుపుకున్నాడు సూర్య. తన భార్య జ్యోతికతో సూర్య పోస్ట్ చేసిన ఈ ఫోటో వైరల్‌గా
తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న మాళవిక మోహనన్ సంక్రాంతి స్పెషల్ ఫోటో.
చేసింది తమిళ సినిమాలే అయినా.. తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయిన హీరో శివకార్తికేయన్.. సంక్రాంతి సందర్భంగా తన ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రతీ పండగకు ట్రెడీషినల్ వేర్‌తో ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసే రాశి ఖన్నా.. ఈ సంక్రాంతికి ఇలా పింక్ లెహెంగాతో క్యూట్‌గా రెడీ అయ్యింది.
తెలుగమ్మాయి ఇషా రెబ్బా.. మరోసారి ఈ సంక్రాంతికి తనలోని తెలుగుదనాన్ని ఉట్టిపడేలా చేస్తోంది.
'పుష్ప' సినిమా సక్సెస్‌తో ఈ సంక్రాంతికి ఫుల్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంది రష్మిక.
గోల్డెన్ లెగ్ అనిపించుకున్న పూజా హెగ్డే ఎప్పటిలాగానే పండగగు అందరి చూపు తనవైపు తిప్పుకునేలా ఉంది.
పంజాబీ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా.. సంక్రాంతి సందర్భంగా తన ఇంట్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బాలకృష్ణ సినిమాలతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న సోనాల్ చౌహాన్.. సంక్రాంతి సందర్భంగా తెలుగింటి అమ్మాయిలా రెడీ అయ్యింది.
కరోనా వల్ల లైగర్ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇంట్లోనే చిల్ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సంక్రాంతి సందర్భంగా తాను షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటో క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండని రవితేజ.. తన అప్‌కమింగ్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ' పోస్టర్ ద్వారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశాడు.
తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నభా నటేశ్.. సంక్రాంతి గెటప్‌లో చూడచక్కగా ఉందని అభిమానులు అనుకుంటున్నారు.
'అఖండ'తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రగ్యా.. ఇంకా ప్రేక్షకులపై తన ఛార్మ్‌తో మ్యాజిక్ చేస్తూనే ఉంది.
తెలుగమ్మాయి అంజలి.. తన అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
క్యూట్ అమృత అయ్యర్.. సంక్రాంతి స్పెషల్ లుక్‌లో సింపుల్‌గా అందరినీ కట్టిపడేస్తోంది.
స్నేహ.. సంక్రాంతి సందర్భంగా దిగిన ఓ ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందాల భామ కృతి శెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో సంక్రాంతి సంబరాలను ఇంటికి తీసుకెళ్తోంది.
మేఘా ఆకాశ్.. ఎప్పటిలాగానే నార్మల్‌గా, క్యూట్‌గా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మలయాళ బ్యూటీ అనూ ఇమాన్యుయల్.. తన స్టైల్‌లో సంక్రాంతికి వెల్‌కమ్ చెప్పింది.