Aparna Balamurali: జాతీయ నటి అవార్డు దక్కించుకున్న అపర్ణా బాలమురళి బ్యాక్‌గ్రౌండ్..
Aparna Balamurali: అపర్ణా బాలమురళి తండ్రి కేపీ బాలమురళి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసేవారు.;
Aparna Balamurali: జాతీయ అవార్డు దక్కించుకోవడం అనేది ఎంతో అరుదైన గౌరవంగా భావిస్తారు సినీ ప్రముఖులు. అలాంటి ఈసారి జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఏకంగా జాతీయ నటిగా అవార్డు అందుకుంది అపర్ణా బాలమురళి.
అపర్ణ ఈ స్థాయికి రావడం కోసం ఎంతోకాలం ఎదురుచూసింది. 18 ఏళ్లగా హీరోయిన్‌గా మారినా కూడా అపర్ణకు ఒకట్రెండు సినిమాలకు మించి వేటిలోనూ పెద్దగా గుర్తింపు దక్కలేదు.
అపర్ణా బాలమురళి తండ్రి కేపీ బాలమురళి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసేవారు. దీంతో చిన్నప్పటి నుండే అపర్ణకు కూడా మ్యూజిక్, సినిమాలు అంటే చాలా ఇష్టం ఉండేది.
చిన్న వయసు నుండే సంగీతం నేర్చుకున్న అపర్ణ.. పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది.
సింగర్‌గా ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్ల తర్వాత నటిగా మారింది అపర్ణ.
'సూరారై పోట్రు' మూవీ అపర్ణ కెరీర్‌లో బిగ్ బ్రేక్. ఇందులో తన చేసిన బొమ్మి పాత్ర.. చాలా నేచురల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే ఈ పాత్రకు తనకు జాతీయ అవార్డు వచ్చిందంటే ఆశ్చర్యం లేదంటున్నారు మూవీ లవర్స్.
తన శరీరాకృతి వల్ల ఎన్నో విమర్శలను ఎదుర్కున్న అపర్ణ.. వాటన్నింటికి తన జాతీయ అవార్డును సమాధానం చూపిస్తోంది.