Huma Qureshi: అప్పుడు రజినీ.. ఇప్పుడు అజిత్.. కోలీవుడ్ స్టార్లతో బాలీవుడ్ భామ..
Huma Qureshi: వలిమై గురించి మాట్లాడుతూ హుమా.. తనకు సౌత్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం అని చెప్పింది.;
Huma Qureshi (tv5news.in)
Huma Qureshi: బాలీవుడ్‌లో బాగా బిజీగా ఉన్న సీనియర్ భామలు.. అప్పుడప్పుడు సౌత్‌లోని సీనియర్లతో కూడా నటిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరే హుమా ఖురేషి.
రజినీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాలా' సినిమాలో హుమా హీరోయిన్‌గా నటించింది.
ఇప్పుడు మరోసారి అజిత్‌తో జోడీకట్టింది హూమా ఖురేషి.
గురువారం విడుదల కానున్న 'వలిమై' చిత్రంలో అజిత్‌కు జోడీగా కనిపించనుంది హుమా.
ఇంతకు ముందు 'నేర్కొండ పార్వై' అనే చిత్రంలో విద్యాబాలన్‌తో కలిసి నటించిన అజిత్.. ఇప్పుడు హుమాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.
తమిళంలోనే కాదు మలయాళంలో కూడా 'వైట్' అనే చిత్రంలో నటించింది హుమా.
ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనెలాంటి వారి తర్వాత హుమా కూడా పలు ఇంగ్లీష్ సినిమాల్లో, సిరీస్‌లలో మెరిసింది.
వలిమై గురించి మాట్లాడుతూ హుమా.. తనకు సౌత్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం అని చెప్పింది.