Irra Mor: 'కొండా'లో సురేఖగా కనిపించేది ఈ అమ్మాయే.. !
Irra Mor: Irra Mor: రోజుకొక కొత్త అమ్మాయి ఇండస్ట్రీలోకి వస్తోంది. కానీ కొంతమందే తమ మార్క్‌ను క్రియేట్ చేయగలుగుతున్నారు;
Irra Mor: రోజుకొక కొత్త అమ్మాయి ఇండస్ట్రీలోకి వస్తోంది. కానీ అందులో కొంతమందే తమ మార్క్‌ను క్రియేట్ చేయగలుగుతున్నారు. అందులో ఒకరే ఇర్రా మోర్. ముంబాయ్‌లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ ముందుగా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత భైరవ గీత అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అప్పటినుండే కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది.
ప్రస్తుతం ఇర్రా.. మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి బయోపిక్‌లో సురేఖ పాత్రలో నటించనుంది. దీనికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుండి విడుదలయిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇర్రాకు ఉన్నట్టుండి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆమె ఫోటోలతో హీట్ పెంచేస్తోంది.