Janhvi Kapoor: జాన్వీ కపూర్ సెంటిమెంట్ ప్లేస్ అదే.. పెళ్లి కూడా అక్కడే..
Janhvi Kapoor: మొదటి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా మూడు అవార్డులను సొంతం చేసుకుంది జాన్వీ కపూర్.;
Janhvi Kapoor (tv5news.in)
Janhvi Kapoor: సినీ పరిశ్రమలో అతిలోకసుందరి శ్రీదేవి. ఆమె సినిమాలకు దూరమైనా.. ఆఖరికి ఈ ప్రపంచాన్నే విడిచి వెళ్లినా.. అతిలోక సుందరిగానే మిగిలిపోతుంది. అలాంటి నటి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. అలాంటి జాన్వీ పుట్టినరోజు నేడు.
2018లో విడుదలయిన 'ధడక్' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ.
మొదటి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా మూడు అవార్డులను సొంతం చేసుకుంది.
సినిమా సినిమాకు తనలోని నటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తోంది జాన్వీ.
అయితే చిన్నప్పటి నుండి జాన్వీ కపూర్‌కు తిరుపతి అంటే చాలా ఇష్టమంట.
అంతే కాకుండా తన జీవితంలో ఎలాంటి ముఖ్యమైన సందర్భం వచ్చినా జాన్వీ కచ్చితంగా తిరుపతికి వెళ్తుంది.
ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా కూడా జాన్వీ తిరుపతిని సందర్శించింది.
అంతే కాకుండా తన పెళ్లి కూడా తిరుపతిలోని జరుగుతుందని జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.