Ketika Sharma: కేతిక.. కుర్రకారు మతులు పోగొట్టే స్పైసీ లుక్స్.. రొమాంటిక్ ఫోజెస్
Ketika Sharma: ప్రస్తుతం పరభాషా హీరోయిన్లకు టాలీవుడ్‌లో క్రేజ్ మామూలుగా లేదు.;
Ketika Sharma: ప్రస్తుతం పరభాషా హీరోయిన్లకు టాలీవుడ్‌లో క్రేజ్ మామూలుగా లేదు. అందుకే ఒక అప్‌కమింగ్ హీరోయిన్ నటించిన డెబ్యూ మూవీ హిట్ అయినా చాలు.. తన కాల్ షీట్ల కోసం క్యూ కడుతున్నారు నిర్మాతలు. నిన్న కాక మొన్న వచ్చిన హీరోయిన్లు కూడా వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి కొత్తగా చేరింది కేతిక శర్మ.
పూరీ జగన్నాధ్ ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. వారందరూ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతున్నారు. ఇప్పుడూ మరోసారి కేతిక శర్మ అనే బాణాన్ని టాలీవుడ్‌లోకి వదులుతున్నాడు పూరీ.
ఆకాశ్ పూరీ పక్కన నటించడానికి 'రొమాంటిక్' సినిమాలో నటించడానికి కొత్త హీరోయిన్ కావాలని నిర్ణయించింది మూవీ టీమ్. అదే సమయంలో పలువురు మోడల్స్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ వారందరినీ దాటి కేతిక శర్మ ఈ ఛాన్స్‌ను కొట్టేసింది.
రొమాంటిక్ చిత్ర షూటింగ్ చాలాకాలం క్రితమే పూర్తయ్యింది. కానీ కోవిడ్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు బ్రేక్ పడింది. ఇన్నాళ్లకు ఈ మూవీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయింది. ఇప్పటికే విడుదలయిన రొమాంటిక్ పాటలలో కేతిక తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంది.
తన మొదటి సినిమా రొమాంటిక్ ఇంకా విడుదల కాకముందే తెలుగులో మరో యంగ్ హీరోతో నటించే ఛాన్స్‌ను కొట్టేసింది. అదే నాగశౌర్యతో నటిస్తున్న లక్ష్య.
ఆర్చరీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేతిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది.
తన రెండు తెలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్ధమవుతుండడంతో తనకు టాలీవుడ్‌లో మంచి ఫ్యూచర్ ఉందని భావిస్తు్న్నారు ప్రేక్షకులు.