Khiladi Movie Heroines: 'ఖిలాడి' భామలు.. గ్లామర్ విషయంలో తగ్గట్లేదుగా..!
Khiladi Movie Heroines: మీనాక్షి చౌదరి కంటే ముందు డింపుల్ హయాతినే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.;
Khiladi Movie Heroines: ఫిబ్రవరి 11న విడుదలవుతున్న సినిమాల్లో ఎక్కువగా హైప్ క్రియేట్ చేస్తున్న చిత్రం 'ఖిలాడి'. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ విడుదలయినప్పటి నుండి ఇందులో హీరోయిన్స్ గురించి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒకరిని మించి మరొకరు గ్లామర్‌ను ఒలికించారు. ప్రస్తుతం వీరి హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
మీనాక్షి చౌదరి కంటే ముందు డింపుల్ హయాతినే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
ముందుగా 'గద్దలకొండ గణేష్' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి టాలీవుడ్‌లోని అందరి దృష్టిని ఆకర్షించింది డింపుల్. అప్పటికీ మీనాక్షి ఇంకా మోడలింగ్‌లోనే స్థిరపడింది.
డింపుల్ కంటే మీనాక్షినే ముందుగా హీరోయిన్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.
2021లో వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా మీనాక్షికి హీరోయిన్‌గా మొదటి సినిమా. 2017లో విడుదలయిన 'గల్ఫ్' అనే చిత్రం డింపుల్‌కు హీరోయిన్‌గా ఫస్ట్ మూవీ.
ప్రస్తుతం వీరిద్దరు రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడిలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
ఖిలాడి సినిమా ప్రమోషన్స్‌లో డింపులే ఎక్కువ యాక్టివ్‌గా కనిపించడంతో మీనాక్షిది సెకండ్ హీరోయిన్ రోల్ అయ్యింటుంది అనుకున్నారు ప్రేక్షకులు.
ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డింపుల్, మీనాక్షి క్యారెక్టర్స్‌కు సమానంగా ప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు రమేశ్ వర్మ స్పష్టం చేశాడు.
ఖిలాడి సినిమా వల్ల వీరిద్దరి కెరీర్‌లు మలుపు తిరుగుతాయని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఇప్పటికే నాని నిర్మిస్తున్న 'హిట్ 2' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది మీనాక్షి చౌదరీ. కానీ డింపుల్ మాత్రం ఇంకా అవకాశాలు కోసం ఎదురుచూస్తోంది.