Madonna Sebastian: ఎవరీ 'మడోన్నా సెబాస్టియన్'.. 'శ్యామ్‌ సింగరాయ్‌'లో ఆమె రోల్..

Madonna Sebastian: సంగీతంలో ప్రావీణ్యం, సమజమైన అందం ఆమె చిత్ర దర్శకుల దృష్టిలో పడడానికి కారణమైంది.

Update: 2021-12-24 06:35 GMT

Madonna Sebastian (tv5news.in)

Madonna Sebastian: సంగీతంలో ప్రావీణ్యం, సమజమైన అందం ఆమె చిత్ర దర్శకుల దృష్టిలో పడడానికి కారణమైంది. కేరళలోని ఎర్నాకులంలో జన్మించిన మడోన్నా సెబాస్టియన్ బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌‌లో పట్టాపొందింది.



ఆమె మ్యూజిక్ కాన్సర్ట్స్‌‌కు యువతలో విపరీతమైన క్రేజ్.. కర్నాటక, పాశ్చాత్య సంగీతంలో శిక్షణ పొందిన మడోన్నా మ్యూజిక్ మోజో అనే టీవీ షో ద్వారా ఫేమస్ అయింది.


సూర్య టీవీ కోసం హోస్ట్ చేస్తున్న కార్యక్రమాన్ని చూసిన ప్రేమమ్ దర్శకుడు అల్ఫోన్స్ పుతారెన్ తన ప్రాజెక్ట్ కోసం మడోన్నాను ఆడిషన్‌కు పిలిచి ముందు మేరీ పాత్రకోసం సెలెక్ట్ చేశారు.


కానీ ఆమె సెలెన్ పాత్ర చేస్తాననడంతో మేరీ పాత్రను అనుపమ పరమేశ్వరన్‌కు ఇచ్చారు.



తమిళంలో నటించిన 'కాదలుమ్ కాదందు పోగుమ్' హిట్ అయి మడోన్నాకు మంచి పేరు తీసుకు వచ్చింది. దాని తర్వాత వచ్చిన 'కింగ్ లయర్' మలయాళ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.


సుమేష్ లాల్ దర్శకత్వంలో 'హ్యూమన్స్ ఆఫ్ సమ్ వన్' అనే హాలీవుడ్ మూవీలోనూ మడోన్నాకు నటించే అవకాశం వచ్చింది.


2015లో రాబీ అబ్రహం సంగీత సారధ్యంలో 'యూ టూ బ్రూటస్' చిత్రం కోసం రావుకలిల్ అనే పాటను పాడింది.


రాబీ, మడోన్నా కలిసి 'ఎవరాఫ్టర్' అనే బ్యాండ్‌తో మ్యూజిక్ షోలు నిర్వహిస్తుంటారు. జనవరి 2016లో బ్యాండ్ 'వెరుతే' పేరుతో తన మొదటి మ్యూజిక్ వీడియోను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.


పాడడం, నటించడం రెండింటిలో ఏది ఇష్టం అంటే.. ముందు నేను మ్యూజిక్ లవర్‌ని, గానం నా రక్తంలో ఉంది..


మంచి ఆఫర్లు వస్తే నటిస్తా.. అంతేకానీ నటనే నా జీవితం లాంటి మాటలు చెప్పను అని అంటోంది మడోన్నా సెబాస్టియన్.


ఇక తెలుగులో తన మొదటి చిత్రం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన శ్యాంసింగరాయ్..


మడోన్నా రోల్ చిన్నదే అయినా తన పాత్రకు తగిన న్యాయం చేసి ప్రేక్షకులను మెప్పించింది. 



Tags:    

Similar News