Manjima Mohan: యంగ్ బ్యూటీ బర్త్‌డే.. స్పెషల్‌గా విష్ చేసిన హీరో..
Manjima Mohan: వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి.;
Manjima Mohan (tv5news.in)
Manjima Mohan: ఇప్పటికే ఎంతోమంది మలయాళ భామలు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రేక్షకుల మనసులను దోచేస్తున్నారు. అందులో ఒకరు మంజిమా మోహన్. ఈరోజు మంజిమా పుట్టినరోజు. అయితే ఈ సందర్భంగా యంగ్ హీరో గౌతమ్ కార్తిక్ స్పెషల్ విషెస్ తెలిపాడు. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని ఇప్పటికే వార్తలు వైరల్ అవుతుండగా.. తాజాగా ఈ విషెస్ కూడా ఈ వార్తలు నిజమే అనిపించేలా చేస్తున్నాయి.
'హ్యాపీ బర్త్ డే మోమో.. నా జీవితంలో నేను దేనికైనా రుణపడి ఉన్నానంటే అది నీలాంటి ఓ స్ట్రాంగ్ వ్యక్తి నా జీవితంలో ఉన్నారు అన్న నిజానికే. ఎప్పుడూ సంతోషంగా ఉండు' అంటూ గౌతమ్ కార్తిక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలిపాడు.
చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మంజిమా మోహన్. చిన్నప్పుడు తాను కేవలం మలయాళ చిత్రాల్లోనే నటించింది.
ఇక హీరోయిన్‌గా కూడా మలయాళ చిత్రం 'ఒరు వడక్కన్ సెల్ఫీ'తోనే పరిచయమయ్యింది.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అచ్చం ఎన్బదు మడమయ్యదా' చిత్రంతో తమిళంలో డెబ్యూ చేసింది.
ఇదే సినిమా 'సాహం శ్వాసగా సాగిపో' పేరుతో తెలుగులో కూడా విడుదలయ్యింది. ఇందులో నాగచైతన్య సరసన నటించింది మంజిమా మోహన్.
'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో మంజిమా క్యూట్ యాక్టింగ్‌కు ప్రేక్షకుల దగ్గర నుండి మార్కులు పడినా కూడా అది అంతగా కమర్షియల్ సక్సెస్ కాకపోవడంతో.. తనకు తెలుగులో మరిన్ని ఆఫర్లు రాలేదు.
చాలాకాలం తర్వాత ఎన్‌టీఆర్ బయోపిక్‌లో నారా భువనేశ్వరి పాత్రలో మెప్పించింది.
మంజిమా మోహన్‌కు టాలీవుడ్ ఎక్కువగా కలిసి రాకపోవడంతో కోలీవుడ్, మాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయింది.
ఇటీవల సీనియర్ హీరో కార్తిక్ కుమారుడు గౌతమ్ కార్తిక్‌తో ప్రేమలో ఉన్నట్టు రూమర్స్ వైరల్ అయ్యాయి.
హిందీలో సూపర్ హిట్ అయిన 'క్వీన్' మలయాళ రీమేక్ 'జామ్ జామ్'లో మంజిమా మోహన్ లీడ్ రోల్ చేసింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.