Meera Jasmine: గ్లామర్ డోస్ పెంచిన మీరా జాస్మిన్.. బర్త్‌డే స్పెషల్..
Meera Jasmine: చాలాకాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న మీరా.. తన కొత్త అవతారంతో అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.;
Meera Jasmine (tv5news.in)
Meera Jasmine: ఈకాలంలోనే కాదు.. ఎప్పటినుండో మలయాళ భామలకు తెలుగు ఇండస్ట్రీలో చాలా క్రేజ్ ఉంది. ఏరికోరి మరీ.. మలయాళ ముద్దుగుమ్ములను తమ సినిమాల్లో హీరోయిన్లుగా ఎంపిక చేసేవారు దర్శక నిర్మాతలు. అలా 2001 నుండి 2010 వరకు టాలీవుడ్‌లో క్యూట్ హీరోయిన్‌గా వెలిగిపోయింది మీరా జాస్మిన్. అలాంటి మీరా జాస్మిన్ పుట్టినరోజు నేడు..
చాలాకాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న మీరా.. తన కొత్త అవతారంతో అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
మీరా జాస్మిన్ హీరోయిన్‌గా పరిచయమయ్యింది 'సూత్రదారన్' అనే మలయాళ సినిమాతో. ఈ మూవీ 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'సూత్రదారన్' విడుదలయిన ఒక సంవత్సరంలోనే మీరాకు తమిళం నుండి కూడా ఆఫర్లు రావడం మొదలయ్యింది.
ఇటు తమిళం, అటు మలయాళంలో కొన్నాళ్ల పాటు బిజీ హీరోయిన్‌గా వెలిగిపోయింది మీరా జాస్మిన్.
2004లో శివాజీ హీరోగా వచ్చిన 'అమ్మాయి బాగుంది' అనే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మీరా జాస్మిన్.
పవన్ కళ్యాణ్‌తో చేసిన 'గుడుంబా శంకర్', రవితేజతో చేసిన 'భద్ర' సినిమాలు మీరా జాస్మిన్‌లో తెలుగులో కూడా స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టాయి.
ఎంత త్వరగా స్టార్‌డమ్‌ను చూసిందో.. మీరా జాస్మిన్ టాలీవుడ్‌లో అంతే త్వరగా వరుస ఫ్లాపులను ఎదుర్కుంది.
రాజశేఖర్ హీరోగా వచ్చిన 'గోరింటాకు' మీరా జాస్మి్న్‌కు తెలుగులో అందిన చివరి హిట్.
తెలుగులో ఫేడవుట్ అయినా కూడా తమిళ, మలయాళంలో మీరా జాస్మిన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
ఇక చాలాకాలం తర్వాత మీరా జాస్మిన్ లీడ్ రోల్‌లో మలయాళంలో 'మకల్' అనే చిత్రంలో నటిస్తోంది.
ఈ బర్త్‌డే ఈ మధ్య ఎన్నడూ లేని విధంగా కాస్త గ్లామర్ డోస్ పెంచి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది.