Mehreen Pirzada: మిల్కీ బ్యూటీ మెహ్రీన్.. ఫోటోలతో మెస్మరైజ్ చేసేస్తుందిగా..
Mehreen Pirzada: మిల్కీ బ్యూటీ అని బిరుదు మరొక హీరోయిన్‌కు ఇవ్వాలంటే కచ్చితంగా మెహ్రీన్‌కే ఇవ్వచ్చని వాదించే వారు ఉంటారు;
Mehreen Pirzada (tv5news.in)
Mehreen Pirzada: మిల్కీ బ్యూటీ అని బిరుదు మరొక హీరోయిన్‌కు ఇవ్వాలంటే అది కచ్చితంగా మెహ్రీన్‌కే ఇవ్వచ్చు అని వాదించే వారు కూడా ఉంటారు. ఫెయిర్‌గా, చూడగానే ఎంత అందంగా ఉంది అనిపించేలా ఉండే మెహ్రీన్ ప్రస్తుతం సినిమాల్లో చాలా బిజీగా గడిపేస్తోంది. అంతే కాక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోషూట్‌లతో అభిమానులను అలరిస్తోంది.
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్‌కు పరిచయం చేసిన చాలామంది హీరోయిన్లను మోహ్రీన్ కూడా ఒకరు. కృష్ణగాడి వీర ప్రేమగాధలో మహాలక్ష్మిగా మొదటి సినిమాతోనే అందరినీ మెప్పించింది మెహ్రీన్.
తెలుగులో అలా ఒక సినిమా చేసిందో లేదో వెంటనే బాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది మెహ్రీన్‌కు.
హిందీలో తాను నటించిన మొదటి సినిమా 'ఫిల్లోరీ'లో అనుష్క శర్మతో స్క్రీన్ షేర్ చేసుకుంది మెహ్రీన్.
హిందీలో ఒక్క సినిమా చేసిన తర్వాత మళ్లీ తెలుగుతెరపైకే వచ్చింది మెహ్రీన్. వరుసగా యంగ్ హీరోలతో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఖాతాలో వేసుకుంటోంది.
కొన్నాళ్లు తెలుగుతెరపై మెరిసిన తర్వాత మెహ్రీన్‌కు తమిళ సినిమాల నుండి కూడా ఆఫర్లు వచ్చాయి. నోటా సినిమాలో విజయ్ దేవరకొండకు జతకడుతూ ఒకేసారి తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించింది.
లాక్‌డౌన్ సమయంలో భవ్య భిష్నాయ్‌తో నిశ్చితార్థం చేసుకున్న మెహ్రీన్.. పెళ్లి సమయానికి నిశ్చితార్థాన్ని బ్రేక్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది.
నిశ్చితార్థం బ్రేక్ అయిన తర్వాత సినిమాల్లో మరింత బిజీగా అయిపోయింది. ఇప్పటికే వరుసగా సినిమాలు సైన్ చేస్తూ బిజీ యాక్ట్రెస్ లిస్ట్‌లో చేరిపోయింది.