Mrunal Thakur: 'సీతారామం' సూపర్ హిట్.. రెమ్యునరేషన్ పెంచేసిన సీత..
Mrunal Thakur: సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన నటీనటులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు మృణాల్ ఠాకూర్.;
Mrunal Thakur: సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన నటీనటులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు మృణాల్ ఠాకూర్.
హిందీలో సీరియల్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన మృణాల్.. మెల్లగా మరాఠీ చిత్రాలతో వెండితెరపై హీరోయిన్‌గా మారింది.
'లవ్ సోనియా' అనే చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఈ భామ.
హిందీలో పలువురు స్టార్ హీరోలతో నటించినా కూడా మృణాల్‌కు వెంటవెంటనే ఆఫర్లు మాత్రం రాలేదు.
తాజాగా 'సీతారామం'తో తెలుగులో డెబ్యూ ఇచ్చింది.
సీతారామం విడుదలయ్యి నెలరోజులు అయిపోయినా.. ఇంకా ప్రేక్షకులు సీత పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారంటే అది మృణాల్ వల్లే.
సీతారామం వల్ల మరికొన్ని తెలుగు చిత్రాల్లో కూడా మృణాల్ నటించే అవకాశం ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
చేసిన మొదటి సినిమా హిట్ అవ్వడం, ఆపై వరుసగా ఆఫర్లు రావడంతో మృణాల్ ప్రస్తుతం రూ.కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.