Niharika Konidela: నిహారికా కొణిదెల బ్యాక్‌గ్రౌండ్ ఇది.. అందుకే అలా..
Niharika Konidela: 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించింది నిహారికా.;
Niharika Konidela (tv5news.in)
Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికీ ఎంతోమంది హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ ఆ ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా పరిచయమయ్యింది మాత్రం నిహారికా కొణిదెల ఒక్కరే. అందుకే తనను ప్రేమగా మెగా ప్రిన్సెస్ అని పిలుచుకుంటారు మెగా అభిమానులు.
నిహారికా కొణిదెల తన కెరీర్‌ను బుల్లితెర నుండే ప్రారంభించింది.
ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా ఓ సీజన్‌ను నడిపించింది నిహారికా.
ఆ తర్వాత వెంటనే 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి తాను కోరుకున్నట్టుగా నిర్మాతగా మారింది నిహారికా.
తన నిర్మాణ సంస్థలో మొదటిగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది. అదే 'ముద్దపప్పు ఆవకాయ'. అప్పటికీ సోషల్ మీడియా అంత యాక్టివ్ కాకపోయినా.. ఓటీటీలాంటివి లేకపోయినా.. యూట్యూబ్‌లో విడుదలయిన 'ముద్దపప్పు ఆవకాయ'కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్‌కు నిహారికా నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా హీరోయిన్‌గా కూడా నటించింది.
ముద్దపప్పు ఆవకాయతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. 'ఒక మనసు' చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యింది.
చివరిగా చిరంజీవి నటించిన 'సైరా' చిత్రంలో ఓ కీలక పాత్రలో మెరిసింది నిహారికా.
2020 డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డతో వివాహం తర్వాత యాక్టింగ్ మానేసి నిర్మాతగానే సెటిల్ అయిపోయింది నిహారికా కొణిదెల.